: అనంతలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ


తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకల సాక్షిగా తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. ఈ ఘటన అనంతపురంలో జరిగిన తెలుగుదేశం సమీక్ష సమావేశంలో జరిగింది. ఎమ్మెల్యే, మేయర్‌ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకున్నారు. పరస్పరం దుర్భాష లాడుకుంటూ, ఫర్నీచర్‌ ను ధ్వంసం చేశారు. రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలోనే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. ఈ తగువులాటలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రులలో చికిత్స నిమిత్తం చేర్చారు.

  • Loading...

More Telugu News