: ఫించ్ డక్కౌట్... ఆస్ట్రేలియా తొలి వికెట్ పడింది!
184 పరుగుల సునాయాస లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫించ్ డక్కౌట్ అయ్యాడు. బౌల్ట్ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతిని ఆడబోయిన ఫించ్ అతనికే క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ రూపంలో పెవీలియన్ దారి పట్టాడు. మరో ఎండ్ లో ఉన్న వార్నర్ జోరుగా ఆడుతున్నాడు. 17 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 15 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 18 పరుగులు.