: రూ. 60 కోట్ల విలువైన హెరాయిన్ తో వస్తున్న ఇద్దరు పాక్ చొరబాటుదారులను హతమార్చిన సైన్యం
భారీఎత్తున హెరాయిన్ ను భారత దేశంలోకి తెస్తున్న ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను సరిహద్దులో బీఎస్ఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. వారి వద్ద నుంచి సుమారు రూ. 60 కోట్ల విలువైన 12 కేజీల హెరాయిన్, ఏకే 47 తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్ఎఫ్ డీఐజీ తెలిపారు. ఆదివారం ఉదయం రతన్ ఖుర్ద్ లోని ఔట్ పోస్ట్ సమీపం నుంచి ఇద్దరు పాక్ చొరబాటుదారులు ఏకే 47 తుపాకీ, చేతిలో ఓ మూటతో వచ్చేందుకు ప్రయత్నించారని అన్నారు. సైన్యం గమనించడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించారని, లొంగిపోవాలని హెచ్చరిస్తే కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని, దీంతో బీఎస్ఎఫ్ దళాలు వారిని హతమార్చాయాని తెలిపారు.