: ఇది న్యూజిలాండ్ జట్టేనా?... 4 డక్కౌట్లా... మ్యాచ్ పై ఆశ లేనట్టే!
లీగ్ దశ నుంచి అప్రతిహత విజయాలతో తిరుగులేని జట్టుగా ఫైనల్స్ లోకి ప్రవేశించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు సత్తాకు తగ్గ ఆటను ప్రదర్శించడంలో విఫలం అయ్యారు. దీంతో ప్రపంచ కప్ ను తొలిసారి సాధించాలన్న వారి కల నెరవేరాలంటే బౌలర్లు అద్భుతం చేయక తప్పని పరిస్థితి నెలకొంది. భీకర బ్యాట్స్ మెన్ లుగా పేరు తెచ్చుకున్న మెక్ కల్లమ్, ఆండర్సన్, రోంచీలతో పాటు, హెన్రీ డక్కౌట్ అయ్యారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో న్యూజిలాండ్ గెలుపిక అసాధ్యమని అభిమానులు ట్వీట్లు ఇస్తున్నారు. ఇది న్యూజిలాండ్ జట్టేనా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు. నిర్ణీత 50 ఓవర్లను సైతం ఆడలేకపోయిన జట్టు 45 ఓవర్లలో 183 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.