: లక్షలాది మంది అశ్రునయనాల మధ్య లీ క్వాన్ యూ అంత్యక్రియలు


సింగపూర్ వ్యవస్థాపక ప్రధాని లీ క్వాన్ యూ అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య ఈ మధ్యాహ్నం ప్రారంభమైంది. గత సోమవారం మరణించిన ఆయన పార్థివదేహాన్ని పార్లమెంటు భవనంలో పలువురు ప్రముఖుల సందర్శన అనంతరం పూర్తి అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు మొదలయ్యాయి. లీ శవపేటికను ఎనిమిదిమంది సీనియర్ కమాండర్ల బృందం పార్లమెంటు వెలుపలకి తీసుకొచ్చారు. వీధుల్లో చేరిన జనం కన్నీటితో 'గుడ్ బై... గుడ్ బై మై డియర్ లీ' అంటూ వీడ్కోలు పలికారు. భద్రత బలగాలు తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించాయి. దాదాపు నాలుగు లక్షలమందికి పైగా ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News