: ఓటేసేందుకు రాని చిరంజీవి, నాగార్జున, వెంకటేష్... 12 గంటల వరకూ పోలయిన ఓట్లు 180
బయటకు కనిపించినంత సీరియస్ గా 'మా' ఎన్నికలను నటీనటులు పట్టించుకున్నట్టు లేరు. ఓటేసేందుకు ఎవరూ రావడం లేదు. 700 మందికి పైగా సభ్యులున్న 'మా' ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరగనుండగా, మధ్యాహ్నం 12 గంటల వరకూ సుమారు 180 ఓట్లు మాత్రమే పోల్ అయినట్టు తెలిసింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ, రామ్ చరణ్ తదితర హీరోలు ఓటేసేందుకు రాలేదు. తొలుత 450 వరకూ ఓట్లు పోల్ కావచ్చని భావించినప్పటికీ, 300 మంది వరకూ మాత్రమే ఓటేసేందుకు రావచ్చని సమాచారం. పోలింగ్ మరో 2 గంటల్లో ముగియనుంది.