: పోటీ మంచిదే... కానీ ఇటువంటి తీరు బాధిస్తోంది: రోజా


ప్రస్తుతం జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తీరు బాధను కలిగించిందని వైకాపా ఎమ్మెల్యే, నటి రోజా అన్నారు. నేడు జరుగుతున్న 'మా' ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. పెద్దలంతా ఓచోట కూర్చుని 'మా' అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బావుండేదని అన్నారు. ఎవరో పెద్దలు తమ స్వార్థంతో నటీనటుల మధ్య చిచ్చు పెట్టారని ఆమె విమర్శించారు. పోటీ ఉండడంవల్ల ఎవరు ఏం చేస్తామన్న విషయాన్ని ముందే చెప్పారని, ఇది కూడా ఒకందుకు మంచిదేనని అన్నారు.

  • Loading...

More Telugu News