: వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భద్రాచలంలోని మిథిలా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి పట్టాభిషేకం కన్నుల పండువగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.