: సూడాన్ సైనికులపై విరుచుకుపడ్డ తిరుగుబాటుదారులు... 54 మంది మృతి
అంతర్గత యుద్ధం జరుగుతున్న సూడాన్ లో తిరుగుబాటుదారులు సైన్యంపై దాడిచేసి 54 మంది సైనికులను చంపేశారు. హబిలా అనే వ్యూహాత్మక నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర సెక్టార్ లోని సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూమెంట్ పేరిట తిరుగుబాటుదారులు హబీలా నగరానికి స్వేచ్ఛ కావాలంటూ, ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. అడ్డొచ్చిన సైనికులను దారుణంగా చంపేశారు. అనంతరం హబీలాకు స్వేచ్ఛ వచ్చిందని తిరుగుబాటుదారుల నేత ఒకరు తెలిపాడు. అయితే, సైన్యం మాత్రం ఈ విషయాలను కొట్టిపారేసింది. హబీలా ఎవరి చేతుల్లోకి వెళ్లలేదని, దాడులను తిప్పికొడుతున్నామని ప్రకటించింది. బాంబులతో వారు దాడి చేయడం వల్ల తమ సైనికులను కోల్పోయామని తెలిపింది.