: అమ్మవారికి భయపడ్డ దొంగలు!


అమ్మవారి గుడిలో హుండీని దొంగతనం చేసిన దొంగలకు భయం కలిగిందో ఏమో! దొంగిలించిన హుండీని తిరిగి యథాస్థానంలో పెట్టి వెళ్లారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కమలాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఇక్కడి అక్కమ్మ దేవత గుడిలో వారం క్రితం గుర్తుతెలియని దొంగలు హుండీని ఎత్తుకుపోయారు. దీనిపై పోలీసు కేసు కూడా నమోదైంది. శ్రీరామనవమి సందర్భంగా శనివారం పూజలు చేయటానికి వెళ్లిన ఆలయపూజారి ఆలయ హుండీ యథాస్థానంలో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. గ్రామస్తులు హుండీని తెరిచి చూడగా అందులో డబ్బు కూడా ఉంది. అక్కమ్మ దేవతకు భయపడిన దొంగలు హుండీని తిరిగి యథాస్థానానికి చేర్చి ఉంటారని గ్రామస్తులు తెలిపారు.

  • Loading...

More Telugu News