: వారసుడిని చూసి మురిసిపోయిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వారసుడిని చూసి మురిసిపోయారు. నిన్న సాయంత్రం చిత్తూరు జిల్లా పర్యటనను ముగించుకున్న ఆయన రాత్రి హైదరాబాదుకు చేరుకొని నేరుగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన తన మనవడిని ఆప్యాయంగా హత్తుకుని సంబరపడ్డారు. కాగా, చంద్రబాబు కుమారుడు లోకేష్, నటుడు బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి దంపతులకు ఉగాది పర్వదినం నాడు సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకు కుమారుడు పుట్టిన సంగతి తెలిసిందే.