: తుదిపోరుకు సిద్ధమైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా... మెల్ బోర్న్ లో కాసేపట్లో మ్యాచ్!
వరల్డ్ కప్ లో టైటిల్ వేట కోసం తుదిపోరు మరికాసేపట్లో జరగనుంది. ఈ పోటీలకు ఆతిథ్య మిచ్చిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల మధ్య మెల్ బోర్న్ లో ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లూ మ్యాచ్ ఫేవరేట్లుగానే బరిలోకి దిగుతున్నాయి. పేస్ కు అనుకూలిస్తుందని భావిస్తున్న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఆసీస్ కు మెరుగైన రికార్డు ఉంది. న్యూజిలాండ్ ను కట్టడి చేస్తామని ఆసీస్ జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్ పేర్కొన్నాడు. లీగ్ దశలో ఆస్ట్రేలియాను ఓడించిన విశ్వాసంతో మరోసారి ఆ దేశంపై గెలిచి తొలి వరల్డ్ కప్ గెలవాలని న్యూజిలాండ్ భావిస్తోంది.