: భారత్ చేరుకున్న టీమిండియా సభ్యులు... ముంబయిలో దిగిన కోహ్లీ, అనుష్క
వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో ఓటమిపాలైన టీమిండియా ఆటగాళ్లలో కొందరు భారత్ చేరుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి పలు విడతలుగా వారు స్వదేశంలో అడుగుపెట్టారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఢిల్లీలో దిగాడు. ఇక ప్రేమ పక్షులు విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ముంబయిలో ల్యాండయ్యారు. రోహిత్ శర్మ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి కూడా ముంబయిలో దిగారు. బీసీసీఐ వర్గాలు ఈ వివరాలు తెలిపాయి. మిగిలిన ఆటగాళ్లు ఈ రాత్రికి భారత్ చేరుకుంటారు.