: ఇస్రో శాస్త్రవేత్తలకు చంద్రబాబు అభినందనలు
పీఎస్ఎల్వీ సి 27 ప్రయోగం విజయవంతం కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రాజెక్టులో పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ 1డి విజయవంతంగా కక్ష్యలో ప్రవేశించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్నారు. ఏర్పేడు మండలం మేర్లపాకలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలకు శంకుస్థాపన చేయడం తెలిసిందే. ఈ మూడు విద్యాసంస్థలను ఒకే చోటు ఏర్పాటు చేస్తున్నారు.