: నింగికెగిసిన పీఎస్ఎల్వీ సి 27


భారత్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పీఎస్ఎల్వీ సి 27 రాకెట్ నింగికెగిసింది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించారు. సొంత నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకు ఉద్దేశించిన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1డి ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహం బరువు 1425 కిలోలు. తయారీకి రూ.125 కోట్లు ఖర్చైంది. భారత నావిగేషన్ వ్యవస్థ మొత్తం ఏడు ఉపగ్రహాలతో కూడినది. తాజా ఉపగ్రహంతో కలిపి ఇప్పటివరకు నాలుగు ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. మరో మూడింటిని ప్రయోగించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News