: ఒకే చోట మూడు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు భూమిపూజ చేసిన చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక చేరుకున్నారు. అక్కడ ఆయన మూడు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు భూమిపూజ చేశారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, స్మృతీ ఇరానీ, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. దీంతో, అక్కడంతా కోలాహలం నెలకొంది. ఈ ప్రాంతంలో, ప్రతిష్ఠాత్మక సంస్థలైన ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ లను భారీ వ్యయంతో ఒకే చోట నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News