: అది ఆసీస్ జట్టుపై కసా?... కివీస్ పై సానుభూతా?


వరల్డ్ కప్ లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాజయాన్ని టీమిండియా ఆటగాళ్లు స్పోర్టివ్ గా తీసుకుని ఉండొచ్చు! కానీ, అభిమానులు మాత్రం ఆ పరాభవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక, ఫైనల్ రేపు జరగనుండడంతో వరల్డ్ కప్ విజేత ఎవరంటూ భారీ చర్చే సాగుతోంది. తాజాగా, ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక "వరల్డ్ కప్ ఎవరు గెలవాలని కోరుకుంటారు?" అంటూ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో 95 శాతం మంది న్యూజిలాండ్ జట్టే గెలవాలని కోరుకున్నారట. కంగారూలను చిత్తుగా ఓడించి, కప్ నెగ్గాలన్నదే వారి కోరిక. దానర్థం, మనల్ని ఓడించిన ఆసీస్ కు టైటిల్ దక్కగూడదనేనా? ఆ విషయం అటుంచితే... ఆసీస్ ఇప్పటికే వరల్డ్ కప్ ను గెలిచిందని, న్యూజిలాండ్ ఇప్పటివరకు గెలవలేదని, అందుకే ఈసారి మెక్ కల్లమ్ సైన్యం టైటిల్ నెగ్గాలని అత్యధికులు అభిప్రాయపడ్డారు. మరికొందరేమో, ఆసీస్ జట్టు కప్ సాధించి ఇటీవల బంతి తగిలి మరణించిన ఫిల్ హ్యూస్ కు నివాళిగా అర్పించాలని భావిస్తున్నారు. ఏదేమైనా, మరో సూపర్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పసందైన విందు అందించనుంది.

  • Loading...

More Telugu News