: హైదరాబాదులో శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభం


శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాదులో శోభాయాత్ర ప్రారంభమైంది. ధూల్ పేట్ వద్ద ఈ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగుతోంది. అటు, ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో మంగళహాట్ నుంచి మరో శోభాయాత్ర జరుగుతోంది. ఈ యాత్రను సుల్తాన్ బజార్ వరకు నిర్వహిస్తారు. ఈ యాత్రల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత పెంచారు. ఎక్కడికక్కడ పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. కాగా, శోభాయాత్ర సందర్భంగా భక్తులు కాషాయ పతాకాలు చేతబూని 'జై శ్రీరామ్' నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన రహదారుల్లో యువత బైక్ లు, జీపుల్లో భారీ పతకాలు పట్టుకుని వెళుతూ సందడి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News