: ఢిల్లీ మెట్రోను పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ మెట్రోరైల్ ను పరిశీలించారు. శివాజీ స్టేడియం నుంచి విమానాశ్రయం వరకు డిల్లీ మెట్రోలో ప్రయాణించి, మెట్రో అనుభవాన్ని రుచిచూశారు. ఈ సమయంలో ఆయన వెంట కేంద్ర మంత్రులు, ఇతర టీడీపీ నేతలు ఉన్నారు. వారంతా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు. తిరుపతిలో సాయంత్రం మూడు విద్యాసంస్థలకు ఒకేసారి శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీ మెట్రోరైల్ ఎండీ శర్మతో సీఎం ముచ్చటించారు. విశాఖ మెట్రోరైల్ నివేదిక ఇవ్వడంలో ఆలస్యానికి కారణాలు చెప్పారు. విజయవాడలో పూర్తిగా పిల్లర్లపైనే మెట్రో నిర్మిస్తామని చెప్పారు. మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మాణానికి 5 నుంచి 7 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ఆయన వెల్లడించారు. నాలుగేళ్లలో విజయవాడ మెట్రోరైల్ పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News