: 10 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ
త్వరలోనే 10వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. విశాఖ నగర పోలీసులకు మంజూరు చేసిన 86 కొత్త వాహనాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన కారణంగా తలెత్తిన ఇబ్బందులు పోలీస్ శాఖపై ప్రభావం చూపాయని అన్నారు. పోలీసు శాఖలో వాహనాల సమస్య తీరినప్పటికీ, తీవ్రమైన సిబ్బంది కొరత వేధిస్తోందని ఆయన తెలిపారు. పదివేల పోలీసు ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు ప్రారంభించామని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపామని ఆయన చెప్పారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే భర్తీ చేపడతామని ఆయన తెలిపారు.