: ఆమె తల్లి కాదు తాటకి!
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన మెదక్ జిల్లా శివంపేట్ లో చోటుచేసుకుంది. తల్లి పదానికే కళంకం తెచ్చిందో మహిళ. మానవసంబంధాలకు మచ్చతెచ్చేలా ప్రవర్తించడమే కాకుండా, దుర్మార్గానికి ఒడిగట్టి కటకటాలపాలైంది. మెదక్ జిల్లా శివంపేటలో ఉంటున్న ఓ మహిళకు అదే జిల్లాలో ఉంటున్న ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఓ కుమార్తె కూడా ఉంది. సంసారంలోని కలతల కారణంగా ఆమె భర్తతో విడిపోయింది. భర్త దగ్గరే కుమార్తెను కూడా వదిలేసింది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న హరితో వివాహేతర సంబంధం కొనసాగించింది. గతేడాది కుమార్తెను కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో చదివించేందుకు తీసుకువచ్చిన ఆ మహిళ, కానిస్టేబుల్ ను బాలికపైకి ఉసిగొల్పింది. దీంతో రెండు రోజుల క్రితం బాలికను చెరబట్టాడు హెడ్ కానిస్టేబుల్ హరి. అత్యాచారానికి గురైన బాలిక ఛైల్డ్ లైన్ ను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఛైల్డ్ లైన్ ఫిర్యాదుతో కానిస్టేబుల్ హరిని, బాలిక తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.