: సిడ్నీలో 'సచిన్ టెండూల్కర్'!


ఐపీఎల్ షెడ్యూల్ తో బిజీబిజీగా ఉన్న బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సిడ్నీ ఎప్పుడు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? అని సందేహిస్తున్నారా!? అదేమీ లేదు, ఈ 'మాస్టర్ ఆఫ్ బ్యాటింగ్ ఆర్ట్' భారత్ లోనే ఉన్నాడు కానీ, ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉన్న అతని మైనపు బొమ్మకు నకలు మాత్రం సిడ్నీ వెళ్ళింది.

విషయం ఏంటంటారా..వచ్చే బుధవారంతో సచిన్ 40వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అరుదైన గౌరవం అందించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. ఈ క్రమంలో విఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వెలుపల సచిన్ మైనపు విగ్రహాన్ని నేడు ఆవిష్కరించారు. ఆస్ట్రేలియాలో సచిన్ అభిమాన బృందం 'స్వామి ఆర్మీ' హర్ష ధ్వనాల నడుమ అతని నిలువెత్తు ప్రతిమను సర్ డాన్ బ్రాడ్ మన్, లెగ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ సరసన నిలుచుండబెట్టారు.

  • Loading...

More Telugu News