: వాజ్ పేయీకి ఇచ్చారు... సంతోషం!... ఎన్టీఆర్ కూ ఇవ్వాలి: చంద్రబాబు
దేశం కోసం వాజ్ పేయీ ఎనలేని సేవలు చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వడం సంతోషదాయకం అని, అయితే, ఎన్టీఆర్ కు కూడా భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పీవీ నరసింహారావు స్మారక కట్టడం నిర్మించాలని అన్నారు. రాష్ట్ర వ్యవహారాల గురించి చెబుతూ, హస్తినలో పలువురు కేంద్ర మంత్రులను కలిశానని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. రెవెన్యూ లోటుతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, అన్ని రాష్ట్రాలతో సమానంగా ఎదిగేందుకు సాయం చేయాలని అడిగామని వివరించారు. పారిశ్రామిక పెట్టుబడులు రావాలంటే రాయితీలు ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పామని స్పష్టం చేశారు.