: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు


ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట, తెలంగాణలోని భద్రాచలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కడప జిల్లాలోని ఒంటిమిట్ట దేవాలయంలో ప్రభుత్వ లాంఛనాలతో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను ఆరంభించారు. అంకురార్పణ కార్యక్రమానికి ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ హాజరుకాగా, భద్రాచలంలో సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం ప్రారంభమైంది. సూర్యచంద్ర వంశాల ఘనత చాటుతూ ఉత్తర ద్వార ప్రాంగణంలో మహోత్సవం నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News