: ఎల్ఈడీ బల్బులు వాడితే 7 బిలియన్ డాలర్లు ఆదా: పియూష్ గోయల్
దేశంలోని ప్రతి ఒక్కరూ ఎల్ఈడీ బల్బులు వాడితే ఏడాదికి ఏడు బిలియన్ల అమెరికన్ డాలర్లు ఆదా చేయవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఉర్జా సంగమ్-2015 కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, అంతా ఎల్ఈడీ బల్బులు వాడడం మొదలు పెడితే భారత్ లో రోజుకు పది వేల మెగావాట్ల విద్యుత్ ఆదా అవుతుందని అన్నారు. అలా ఏడాదికి ఏడు బిలియన్ డాలర్లు ఆదాచేసే అవకాశం ఉందని అన్నారు. అందుకు 2016 మార్చి నాటికి దేశంలోని 100 నగరాల్లో పూర్తిగా ఎల్ఈడీ బల్బులనే వాడేట్టు చేయడం లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. రానున్న మూడేళ్లలో దేశం మొత్తం ఎల్ఈడీ బల్బులు వాడేలా చూస్తామని ఆయన వెల్లడించారు.