: జగన్ కేసులో మరో అటాచ్ మెంట్
జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరో అటాచ్ మెంట్ కు సిద్ధమైంది. రాంకీ ఫార్మాకు చెందిన రూ.216.18 కోట్ల విలువైన ఆస్తుల తాత్కాలిక జప్తుకు ఈడీ ఆదేశాలు జారీ చేసింది. విశాఖ రాంకీ ఫార్మాసిటీలో 159 ఎకరాల స్థలాన్ని ఈడీ అటాచ్ చేసింది. అక్కడే మరో 18 ఎకరాల స్థలాన్ని కూడా అటాచ్ చేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై అటు సీబీఐ కోర్టులోనూ విచారణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఈడీ కూడా జగన్ కేసుల్లోని ఆర్థిక అవకతవకలపై దృష్టి సారించి, వాస్తవాలను వెలికితీసే పనిలో నిమగ్నమైంది.