: రూ. 49 వేల కోట్లు దానం చేయనున్న యాపిల్ చీఫ్ టిమ్ కుక్


ప్రపంచంలో అతిపెద్ద సాంకేతిక సేవల సంస్థ 'యాపిల్' చీఫ్ టిమ్ కుక్ తన సంపద మొత్తాన్నీ దాతృత్వ కార్యకలాపాలకు రాసివ్వాలని నిర్ణయించుకున్నాడట. ఈ విషయాన్ని ఫార్చ్యూన్ మాగజైన్ వెల్లడించింది. 10 ఏళ్ల వయసున్న తన మేనల్లుడి కాలేజీ విద్యకు అయ్యే మొత్తం మినహా మిగతా ఆస్తులన్నింటినీ దానధర్మాలకు వెచ్చించనున్నారని, అందుకోసం ప్రణాళికలను సిద్ధం చేశారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన వద్ద 785 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 49,141 కోట్లు) విలువైన ఆస్తులున్నాయి. కాగా, మరో బిలియనీర్ వారెన్ బఫెట్ తన ఆస్తిలో సగం దానధర్మాలకు ఇస్తానని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News