: డబుల్ సెంచరీలకు కారణం ఆ నిబంధనే... దానిని మార్చాలి: ధోనీ


వన్డేల్లో బ్యాట్స్ మెన్ కు అనుకూలంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రవేశపెట్టిన నలుగురు ఫీల్డర్ల నిబంధనను మార్చాలని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డిమాండ్ చేశాడు. దీనిపై ధోనీ మాట్లాడుతూ, ఈ నిబంధన మార్చాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నాడు. క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే ఈ నిబంధన లేకముందు డబుల్ సెంచరీ సాధించడమంటే అసాధ్యమనిపించేదని పేర్కొన్నాడు. ఐసీసీ నిబంధన కారణంగా ఈ మూడేళ్లలో మూడు ద్విశతకాలు నమోదయ్యాయని ధోనీ గుర్తు చేశాడు. నాన్-పవర్ ప్లే ఓవర్లలో 30 యార్డ్ సర్కిల్ బయట కేవలం నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలని ఐసీసీ నిబంధన తెచ్చిన సంగతి తెలిసిందే. ఐసీసీ నిబంధన కారణంగా వికెట్లు తీయాలని అడగాల్సిన కెప్టెన్లు డాట్ బాల్స్ వేయాలని కోరాల్సి వస్తోందని వాపోయాడు. 11 మందినీ సర్కిల్ లోపలే ఉంచితే మరిన్ని డాట్ బాల్స్ పడతాయని ధోనీ ఐసీసీ నిబంధనను ఎద్దేవా చేశాడు.

  • Loading...

More Telugu News