: ఆంధ్రా బ్యాంకులో పెరిగిన కేంద్రం వాటా
ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకుకు అదనపు మూలధనాన్ని అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులో తన వాటాను పెంచుకుంది. బ్యాంకుల్లో మూలధనాన్ని నిబంధనల మేరకు సర్దుబాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా కేంద్రం కేటాయించిన నిధుల్లో ఆంధ్రా బ్యాంకు వాటా కింద రూ. 120 కోట్లు లభించాయి. ఇందుకు ప్రతిగా రూ. 10 ముఖవిలువ ఉన్న ఈక్విటీ వాటాకు రూ. 80.69 ప్రీమియం కలిపి షేర్ ఒక్కింటికి రూ. 90.69 ధరపై మొత్తం 1,32,31,888 వాటాలను ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ పద్ధతిలో బ్యాంకు కేంద్రానికి కేటాయించింది. దీంతో, ఇప్పటి వరకూ ఆంధ్రా బ్యాంకులో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 60.14 శాతం వాటా, 61.01 శాతానికి పెరిగినట్లయింది.