: ఏపీ రుణమాఫీ లబ్ధిదారుల రెండో జాబితా విడుదల... సాయంత్రంలోగా వెబ్ సైట్ లో!
ఏపీలో రైతు రుణమాఫీకి సంబంధించిన రెండో జాబితా విడుదలైంది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తూ తొలి జాబితాను ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా రెండో జాబితాను నేడు విడుదల చేసింది. నేటి మధ్యాహ్నానికే తాజా జాబితా ఆయా బ్యాంకులకు చేరింది. జాబితాను నేటి సాయంత్రంలోగా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.