: నేడు భూమిని దాటనున్న భారీ ఉల్క
ఒక భారీ ఉల్క నేడు భూమికి సమీపంగా వెళ్లనుంది. గత సంవత్సరం చివరిలో కాటలినా స్కై సర్వే ఈ ఉల్కను కనుగొంది. సుమారు కిలోమీటరు వెడల్పున్న ఈ ఉల్క గంటకు 23 వేల మైళ్ళ వేగంతో అంతరిక్షంలో పయనిస్తోంది. నాసా లెక్కల ప్రకారం ఈ ఉల్క భూమికి 28 లక్షల మైళ్ళ దూరం నుంచి వెళ్లనుంది. భూమి నుంచి చంద్రుడికు ఉన్న దూరం కంటే ఇది 11.7 రెట్లు అధికం. ఈ ఉల్క వల్ల భూమికి ఎటువంటి ప్రమాదమూ లేదని శాస్త్రవేత్తలు గతంలోనే ప్రకటించారు.