: కృష్ణానదీ జలాల వివాదాల పిటిషన్లపై విచారణ వాయిదా


కృష్ణానదీ జలాల వివాదాల పిటిషన్లపై విచారణ ఏప్రిల్ 29కి వాయిదా పడింది. 3 వారాల్లో కౌంటర్లు, రిజాయిండర్లు దాఖలు చేయాలని ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను ఆదేశించింది. కౌంటర్లు మూడు పేజీలకు మించరాదని సూచించింది. కాగా ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటినే ప్రస్తుత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలని, నదీజలాల వివాదం ఎక్కువ కాలం అపరిష్కృతంగా ఉండరాదని కోర్టు సూచించింది. అయితే తమకు వీలుకాదని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకు తెలిపారు.

  • Loading...

More Telugu News