: శక్తిమేర పోరాడారు... టీమిండియాను చూసి గర్వపడుతున్నా: ధోనీ సతీమణి సాక్షి


అప్పటిదాకా కొనసాగించిన బ్యాటింగ్ జోరుతో పాటు బౌలింగ్ లోనూ చేతులెత్తేసిన టీమిండియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. టీమిండియా నిష్క్రమణపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుంటే, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ ధోనీ మాత్రం టీమిండియా పోరాట పటిమను ఆకాశానికెత్తేసింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలను పోస్ట్ చేసింది. ‘‘శక్తిమేర పోరాడారు. చాలా గర్వంగా ఉంది. కొన్ని మ్యాచ్ లలో గెలిస్తే, కొన్నింటిలో ఓడిపోతుంటాం. ఏదేమైనా ఎట్టకేలకు నా భర్తను చూడబోతున్నా’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News