: 'స్లమ్ డాగ్ మిలియనేర్' రచయితే... విదేశాంగ శాఖ కొత్త అధికార ప్రతినిధి
కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త అధికార ప్రతినిధిగా వికాస్ స్వరూప్ నియమితులు కాబోతున్నారు. ప్రస్తుతమున్న సయ్యద్ అక్బరుద్దీన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అదనపు కార్యదర్శి హోదాలో పదోన్నతి కారణంగా స్వరూప్ ను ఎంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ లో మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఆయన తిరిగొచ్చాక పదవీ బాధ్యతలు చేపడతారు. 'క్వశ్చన్ అండ్ ఆన్సర్స్' పుస్తకంతో స్వరూప్ పాప్యులర్ అవగా, ఈ పుస్తకం ఆధారంగా 'స్లమ్ డాగ్ మిలియనేర్' అనే హాలీవుడ్ చిత్రం తెరకెక్కింది. 1986 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన స్వరూప్ ప్రస్తుతం ఐరాస రాజకీయ విభాగంలో ఉమ్మడి కార్యదర్శిగా పని చేస్తున్నారు.