: ఆర్టీసీ బస్సుకే టెండరేసిన లారీ డ్రైవర్... బస్సు సహా పోలీసులకు పట్టుబడ్డ వైనం


అతనో లారీ డ్రైవర్. డ్రైవర్ గా జీవితం నచ్చేలేదేమో. యజమాని అవుదామనుకున్నాడు. అది కూడా లారీకి కాదట. బస్సుకట. మరి డబ్బెలా? ఎన్ని రోజులు డ్రైవర్ గా పనిచేస్తే బస్సు కొనగలడు? పనిచేసే సంపాదించాలా? మరో మార్గం కూడా ఉంది కదా అంటూ బయలుదేరాడు. ఆర్టీసీ డిపోలో నిలిపిన ఖాళీ బస్సును కొట్టేశాడు. ఎంచక్కా పరారయ్యాడు. అయితే తాననుకున్న లక్ష్యం కాదు కదా, కనీసం తొలి గమ్య స్థానం కూడా చేరలేకపోయాడు. కొట్టేసిన బస్సుతో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడ్డాడు. ఆదిలాబాదు జిల్లా నిర్మల్ లో నిన్న ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సును కొట్టేద్దామన్న ఆలోచన వచ్చిన లారీ డ్రైవర్ శ్రీకాంత్, నిర్మల్ డిపోలోని బస్సుతో ఉడాయించాడు. దీనిని గమనించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, నేరెడిగొండ మండలం రోడ్డుమాముల టోల్ ప్లాజా వద్ద మాటు వేసి శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. బస్సును ఆర్టీసీ అధికారులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News