: న్యూయార్క్ లో పేలుడు... కూలిన భవనాలు


న్యూయార్క్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈస్ట్ విలేజ్ లోని ఒక కమర్షియల్, రెండు రెసిడెన్షియల్ భవంతులలో గ్యాస్ పేలుడు సంభవించగా, ఈ మూడు భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనలో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గ్యాస్ పేలుడు శబ్దం విని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమీపంలోని సీసీటీవీలో పేలుడు దృశ్యాలు, ఆ తరువాత ప్రజల పరుగులు రికార్డు అయ్యాయి. గృహావసరాలకు గ్యాస్ సరఫరాచేసే పైప్ లైన్ కు మరమ్మతులు చేస్తుండగా ఘటన జరిగినట్టు న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో తెలిపారు.

  • Loading...

More Telugu News