: సినీ నటి శ్రుతిహాసన్ పై కోర్టుకెక్కిన పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్


అందాల కథానాయిక శ్రుతిహాసన్ పై పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ హైదరాబాదు సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. తమ సినిమాకు డేట్లు ఇచ్చి షూటింగ్ కు హాజరు కావట్లేదని అందులో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సినిమాకుగానూ చేసుకున్న ఒప్పందాన్ని ఆమె ఉల్లంఘించారని, దాంతో తాము రూ.3కోట్లు నష్టపోయామని పిక్చర్ హౌస్ మీడియా తెలిపింది. వెంటనే ఆ పిటిషన్ ను విచారించిన సివిల్ కోర్టు న్యాయమూర్తి, ఆమెపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అంతేగాక, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వేరే సినిమాలకు శ్రుతి సంతకం చేయకూడదంటూ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది. నటులు నాగార్జున, కార్తి కాంబినేషన్ లో పిక్చర్ హౌస్ మీడియా సంస్థ ఓ సినిమా నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్ గా శ్రుతిని ఎంచుకున్నారు.

  • Loading...

More Telugu News