: నేడు కోర్టు బోనెక్కనున్న కండల వీరుడు... కారు ప్రమాదం కేసులో తన వాదన వినిపించనున్న సల్మాన్


మద్యం తాగి, వేగంగా కారు నడిపి ఒకరి మృతికి కారణమైనాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, నేడు కోర్టులో తన వాదనలు వినిపించనున్నారు. 2004లో జరిగిన ఆ ఘటనకు సంబంధించి వీలయితే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, లేకుంటే అతి తక్కువ శిక్షతో బయటపడడానికి ఇదొక కీలకమైన అవకాశం. మొత్తం 25 మంది సాక్షులను విచారించిన అనంతరం, సీఆర్‌పీసీలోని 313 సెక్షన్ కింద ఖాన్ తన వాదనలు వినిపించడానికి కోర్టుకు రావాలని న్యాయమూర్తి దేశ్‌ పాండే సమన్లు జారీ చేశారు. సల్మాన్ వాదన రికార్డు చేసిన అనంతరం, కావాలంటే సాక్షులను నేరుగా ప్రశ్నించే అవకాశం అతడికి కోర్టు కల్పిస్తుందని, ఆపై తీర్పు ఇస్తుందని ప్రభుత్వ ప్రత్యేక ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News