: ఆ సంపద ఏపీ సొత్తు... ఎప్పుడు తెస్తారు?: బాబు సర్కారుకు మండలి ఛైర్మన్ సూటి ప్రశ్న


హైదరాబాదులోని తెలుగు వర్సిటీలో ఉన్న తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన ప్రతులు, కళాఖండాలు ఆంధ్రప్రదేశ్ సొత్తని, ఆ సంపదను రాష్ట్రానికి తరలించేందుకు ఎటువంటి విధానాన్ని పాటించబోతున్నారని శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వర్సిటీ విభజన ఎంత వరకు వచ్చిందని ఆయన అడిగారు. సాంస్కృతిక సంపదను వెనక్కు తెచ్చి భావి తరాలకు అందించేందుకు అవసరమైతే ప్రాంతాలకతీతంగా తెలుగు భాష, సంస్కృతిపై అపార జ్ఞానం కలిగిన మేధావులతో కమిటీ వేయాలని కోరారు. తెలుగు వర్సిటీ, ఆస్తుల విభజనపై శాసనమండలిలో జరిగిన అత్యవసర చర్చలో చక్రపాణి ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతికి చెందిన ఎన్నో కళాఖండాలు విదేశాల్లో ఉన్నాయని, వాటిని వెనక్కు తెప్పించడంలో విఫలమవుతున్నామని నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. తెలుగు వర్సిటీ ప్రధాన పరిపాలన కార్యాలయం శ్రీశైలంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు కోరారు.

  • Loading...

More Telugu News