: అచ్చెన్నా... నీకు మంచి భవిష్యత్తు ఉంది!: ఏపీ మంత్రికి చంద్రబాబు బర్త్ డే గ్రీటింగ్స్!


ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తన బర్త్ డే సందర్భంగా నిన్న సీఎం నారా చంద్రబాబునాయుడు నుంచి వెల్లువెత్తిన గ్రీటింగ్స్ లో తడిసిముద్దయ్యారట. ‘‘అచ్చెన్నా... నీకు మంచి భవిష్యత్తు ఉంది’’ అంటూ సాక్షాత్తు సీఎం కీర్తించడంతో అచ్చెన్నాయుడు ఉబ్బితబ్బిబ్బయ్యారు. నిన్న తన జన్మదినం సందర్భంగా చంద్రబాబు ఆశీస్సులు తీసుకునేందుకు అసెంబ్లీలోని ఆయన ఛాంబర్ కు అచ్చెన్నాయుడు వెళ్లారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ తెప్పించిన చంద్రబాబు, దానిని ఆయనే కట్ చేసి, అచ్చెన్నకు స్వయంగా తినిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు అచ్చెన్న పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా ‘‘మీ అన్నయ్య ఎర్రన్నాయుడు పార్టీకి పెట్టని కోట. పార్టీలో అందరికీ పెద్ద దిక్కు. నాకు ప్రాణం. నువ్వు కూడా మీ అన్నయ్య అంతటివాడివి అవుతావు. అసెంబ్లీలో నువ్వేమిటో నిరూపించుకుంటున్నావు. నీకు మంచి భవిష్యత్తు ఉంది’’ అని చంద్రబాబు, అచ్చెన్నాయుడిని దీవించారు. దీనికి ప్రతిగా ‘‘నాకు మా అన్నయ్య ఎర్రన్నాయుడు, మీరే అన్నీ. అన్నయ్య లేరు. అందుకే మీకే పాదాభివందనం చేస్తున్నాను’’ అని అచ్చెన్నాయుడు, చంద్రబాబుకు చెప్పారు.

  • Loading...

More Telugu News