: ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం
తెలంగాణ శాసన మండలికి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ లో ఆయన 59,764 ఓట్లు సాధించారు. ఎమ్మెల్సీగా విజయం సాధించాలంటే 66,777 ఓట్లు కావాల్సి ఉంది. తగినంత మెజారిటీ సాధించలేకపోవడంతో, రెండవ ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ మొదలు పెట్టారు. ఇందులో రాజేశ్వరరెడ్డి 12 వేల ఓట్లకుపైగా మెజారిటీ సాధించడంతో విజయం సాధించారు.