: తొమ్మిది సింహాలతో మనిషి సహవాసం!


ప్రతి ఒక్కరికీ అభిరుచులు ఉంటాయి. సాధు జంతువులను పెంచుకోవడం కొందరికి ఇష్టం, పక్షులను పెంచుకోవడం మరికొందరికి ఇష్టం. అయితే క్రూర మృగాలను పెంచుకోవడం అసాధారణ అభిరుచి. అసాధ్యాలను సుసాధ్యం చేయాలని భావించేవారే వినూత్నంగా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కొన్ని ప్రాణాలు ఫణంగా పెట్టాల్సి వస్తుంది. పాకిస్థాన్ లోని ముల్తాన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో ఏకంగా సింహాల కుటుంబాన్నే పెంచుకుంటున్నాడు. ఆఫ్రికా జాతికి చెందిన రాజా, రాణి అనే రెండు సింహాలను పెంచుకోవడం ప్రారంభించాడు. తొమ్మిది నెలల క్రితం రాజు, రాణికి రెండు సింహాలు జన్మించాయి. నేడు మరో ఐదు సింహాలు జన్మించాయి. సింహాలు సాధారణంగా కాన్పులో రెండు లేక మూడు సింహాలకు మాత్రమే జన్మనిస్తాయి. వీటన్నింటినీ అతను కంట్రోల్ చేస్తూ, స్నేహంగా జీవిస్తున్నాడు. సింహాలన్నీ అతని మాట వినడం విశేషం. అతనంటే వాటికి ఎంతో ఇష్టం. మొత్తానికి అతను సింహాల కుటుంబంతో జీవిస్తూ సంతోషంగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News