: యువీ ఉండి ఉంటే ఇలా జరిగేదా?...దోషి ధోనీయే: సామాజిక మాధ్యమాలు


ప్రపంచకప్ లో టీమిండియా సెమీఫైనల్ దశలో ఘోరపరాజయం పాలవ్వడంతో అంతా యువరాజ్ సింగ్ నామస్మరణలో మునిగిపోయారు. టీమిండియా ఓటమికి కారణం, ధోనీ, సెలక్టర్లు అని నెటిజన్లు మండిపడుతున్నారు. టీమిండియా ఓటమిపై క్రికెట్ అభిమానులు విశ్లేషణలు చేస్తున్నారు. యువీ ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. ధోనీ సేన బౌలర్ల ప్రతిభతో సెమీఫైనల్ వరకు అప్రతిహత విజయాలు సాధించిందని పేర్కొంటున్నారు. టీమిండియా బౌలర్లు తప్ప బ్యాట్స్ మన్ సమష్టిగా రాణించిన ప్రదర్శన ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని చెబుతున్నారు. యువరాజ్ జట్టులో ఉండి ఉంటే, భారీ షాట్లు ఆడాల్సి వచ్చినా, సింగిల్స్ తీయాల్సి వచ్చినా భయపడేవాడు కాదని అభిమానులు చెబుతున్నారు. ఒత్తిడిలో యువీ మరింత అద్భుతంగా రాణిస్తాడని వారు చెబుతున్నారు. 2011 వరల్డ్ కప్ లో యువీ క్యాన్సర్ తోనే ఆడాడని, ఇప్పుడు వైద్యం తీసుకుని సౌకర్యంగానే ఉన్నాడని, ప్రపచంకప్ ముందు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు. యువీ జట్టులో చోటు దక్కించుకోలేకపోవడానికి కారణం ధోనీ, సెలక్టర్లే కనుక వారంతా అతనికి, అభిమానులకు క్షమాపణలు చెప్పాలని మరింతమంది కోరారు.

  • Loading...

More Telugu News