: ధోనీ నివాసం వద్ద భద్రత పెంపు


ప్రపంచ కప్ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టుపై ఘోరపరాజయం పాలవ్వడంతో జార్ఖండ్ పోలీసులు, టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సెమీస్ లో భారత జట్టు భారీ ఓటమి చెందడంతో, ధోనీ నివాసం వద్ద అభిమానులు నిరసన ప్రదర్శనకు దిగడం, లేదా అనుచిత చర్యలకు పాల్పడే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. టీమిండియా మ్యాచ్ లో కోహ్లీ అవుట్ అయిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కోహ్లీ ప్రదర్శన పేలవంగా ఉండడానికి కారణం అనుష్క శర్మ అని ఆరోపిస్తూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ కుటుంబ సభ్యుల నివాసంపై ఎలాంటి దాడులు చేపట్టకుండా ఉండేందుకు భద్రతను పెంచారు.

  • Loading...

More Telugu News