: టీడీపీ కార్యకర్తలను సన్మానించనున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించనున్నారు. ఈ నెల 29న ఆయన తుళ్లూరు వచ్చి అక్కడి పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రతి జిల్లా నుంచి పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన ఇద్దరు కార్యకర్తలను ఆ సభలో సీఎం సన్మానించనున్నారు.