: బహిరంగ ముద్దులను నిషేధించిన గోవాలోని ఓ గ్రామం
మన దేశంలో అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాల్లో గోవా ఒకటి. వారికి ఆదాయం కూడా పర్యాటకం ద్వారానే వస్తోంది. అలాంటి గోవాలోని ఓ గ్రామం పర్యాటకులపై కొన్ని ఆంక్షలను విధించింది. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం, మద్యం సేవించడం, పెద్ద శబ్దంతో మ్యూజిక్ పెట్టుకోవడం లాంటి వాటిని ఆ గ్రామ పంచాయతీ నిషేధించింది. ఈ చర్యల వల్ల తాము చాలా ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు.