: టీమిండియా పరాజయం ఖాయం


ప్రపంచకప్ సెమీఫైనల్ లో టీమిండియా పరాజయం ఖాయమైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ తేలిపోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ భారత బౌలర్లను ఆటాడుకున్న చోట, స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆసీస్ బౌలర్లు సత్తాచాటారు. టీమిండియా టాపార్డర్ ను చాపలా చుట్టేశారు. కట్టుదిట్టమైన బంతులతో టీమిండియా బ్యాట్స్ మన్ క్రీజులో స్వేచ్చగా కదిలే అవకాశం కూడా ఇవ్వలేదు. పేస్ బౌలింగ్ లోని అస్త్రాలన్నీ ఉపయోగించిన ఆసీస్ బౌలర్లు టీమిండియాను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. టాపార్డర్, మిడిలార్డర్ ను చక్కని బంతులతో పెవిలియన్ బాటపట్టించారు. రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ లోనైనా రాణించకపోతాడా? అని ఎదురుచూసిన అభిమానులను నిరాశకు గురి చేస్తూ రనౌట్ కావడంతో టీమిండియా అభిమానుల్లో మిణుకుమిణుకుమంటున్న ఆశలు ఆవిరయ్యాయి. దీంతో టీమిండియా పరాజయం ఖాయమైంది. ఏదయినా అద్భుతం జరిగితే తప్ప టీమిండియా విజయం అసాధ్యమే.

  • Loading...

More Telugu News