: శానిటరీ పాడ్స్ పై ప్రచారం చేసినందుకు విద్యార్థినులపై కాలేజీ యాజమాన్యాల వేధింపులు


యువతులకు నెలసరి సమయంలో వెలువడే రక్తం వివిధ రకాల రుగ్మతలకు కారణం అవుతుందని ప్రచారం చేస్తూ, శానిటరీ పాడ్స్ వాడకంపై అవగాహన కల్పిస్తున్న విద్యార్థినులపై కొన్ని కాలేజీల యాజమాన్యాలు వేధింపులకు గురి చేస్తున్నాయి. ఈ ఘటనలు సాక్ష్యాత్తూ దేశ రాజధానిలో జరగడం గమనార్హం. ఒక కాలేజీలో విద్యార్థిని నడుపుతున్న మాగజైన్ ను నిషేధిస్తే, మరో కాలేజీలో పాడ్స్ పై ప్రచారం ఎందుకు చేశారని నలుగురికి నోటీసులు పంపారు. కళాశాల క్యాంపస్ లో పాడ్స్ పై ప్రచారం ఏంటని ప్రశ్నిస్తూ, ది జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థినులు సహా పలువురికి నోటీసులు పంపి సమాధానం ఇవ్వాలని యాజమాన్యం ఆదేశించింది. తమ నోటీసులను వర్సిటీ ప్రతినిధి ముకేష్ రంజన్ సమర్థించుకుంటూ, "ఈ ప్రచారానికి తాము వ్యతిరేకం కాదు. కానీ ప్రచారం నిర్వహిస్తున్న పధ్ధతి తప్పు. పలువురు విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నాం" అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు జర్మనీ మహిళా ఎలోనా ప్రారంభించిన శానిటరీ పాడ్స్ ప్రచారానికి భారత్ లో సైతం మద్దతు పెరుగుతోంది. ఢిల్లీ కళాశాలల్లో "నెలసరి సహజం - అత్యాచారం అసహజం", "రేపిస్టులు మహిళలపై అత్యాచారం చేస్తారు... వేసుకున్న దుస్తులను కాదు" తదితర స్లోగన్స్ కనిపిస్తున్నాయి. విద్యార్థుల ప్రచారాన్ని అడ్డుకుంటున్న కాలేజీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News