: 'బోనాల పోతరాజు' చిత్రానికి పాట రాస్తున్న కేసీఆర్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో దాగున్న గేయ రచయిత మరోసారి బయటకు రానున్నాడు. ఆర్.నారాయణమూర్తి హీరోగా అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో తీస్తున్న 'బోనాల పోతరాజు' చిత్రంలో పాట రాయాలని కేసీఆర్ ను కోరినట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం శ్రీధర్, నారాయణమూర్తి కలసి వెళ్లి పాట రాయాలని కోరగా, కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. కేసీఆర్ లో ఒక గేయ రచయిత దాగున్నాడని చాలా మందికి తెలియదు. గతంలో ఆయన ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన 'జై బోలో తెలంగాణ' కోసం ఓ లిరిక్ ను రాశారు. కాగా, 'బోనాల పోతరాజు' చిత్రాన్ని సానా యాదిరెడ్డి నిర్మిస్తున్నారు.