: రోహిత్, రైనా అవుట్... నిరాశలో టీమిండియా అభిమానులు


టీమిండియా బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ కీలక సమయంలో అవుటయ్యాడు. సిక్స్ కొట్టి మంచి జోరుమీదున్న రోహిత్ శర్మ తరువాతి బంతికే క్లీన్ బౌల్డయ్యాడు. అనంతరం బరిలో దిగిన సురేష్ రైనా జాగ్రత్తగా ఆడినప్పటికీ అవుటయ్యాడు. వరుస విరామాల్లో టీమిండియా టాపార్డర్ లోని ముగ్గురు కీలక బ్యాట్స్ మన్ పెవిలియన్ బాటపట్టడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. దీంతో టీమిండియా 23.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. టీమిండియాలో విరాట్ కోహ్లీ(1) శిఖర్ ధావన్ (45) రోహిత్ శర్మ(34) సురేష్ రైనా(7) అవుటయ్యారు. దీంతో రహానే(13), ధోనీ(2) క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News